TS TET Recruitment 2023 : టెట్ నోటిఫికేష‌న్ రిలీజ్

సెప్టెంబ‌ర్ 15 ప‌రీక్ష..27న రిజ‌ల్ట్స్

TS TET Recruitment 2023 : తెలంగాణ ప్ర‌భుత్వం టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌) టెట్ ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 15న ప‌రీక్ష నిర్వ‌హించ‌నుంది. ఆగ‌స్టు 2 నుండి 16 వ‌ర‌కు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. సెప్టెంబ‌ర్ 9 నుండి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 27న టెట్ ప‌రీక్ష రాసిన ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు.

TS TET Recruitment 2023 Notification

పాఠ‌శాల విద్యా శాఖ టెట్ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. టీఎస్ టెట్(TS TET) అధికారిక వెబ్ సైట్ లో వివ‌రాలు పొందు ప‌ర్చింది. రాష్ట్రంలో ప్రాథ‌మిక‌, ఉన్న‌త ప్రాథ‌మిక స్థాయిల‌లో బోధ‌న‌లో వృత్తిని కొన‌సాగించాల‌ని అనుకునే అభ్య‌ర్థుల‌కు గేట్ వే గా ప‌ని చేస్తుంది టెట్. తెలంగాణ పాఠ‌శాల విద్యా శాఖ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర స్థాయి ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది.

ఇదిలా ఉండ‌గా స‌ర్కార్ బ‌డుల్లో టీచ‌ర్లుగా కొన‌సాగాల‌ని అనుకుంటే త‌ప్ప‌నిస‌రిగా టెట్ ఉత్తీర్ణ‌త సాధించాల్సిందే. టెట్ రాయాలంటే అభ్య‌ర్థులు విధిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి డీఈడి లేదా బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ఎన్సీటీఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభ‌న్న విక‌లాంగుల విష‌యంలో 45 శాతం ఉండాలి. బీఈడీ కూడా ముఖ్యం. క‌నీస వ‌య‌సు 18 ఏళ్లు..గ‌రిష్ట వ‌యో ప‌రిమితి లేదు. జాతీయ‌త విష‌యానికి వ‌స్తే భార‌తీయ పౌరులు అయి ఉండాలి. తెలంగాణ వాసి ఉండాలి. గ‌తంలో టెట్ లో అర్హ‌త సాధించ‌క పోయిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Also Read : CM KCR Visit : మ‌హాల‌క్ష్మి గుడిలో సీఎం కేసీఆర్ 

 

Leave A Reply

Your Email Id will not be published!