CM KCR Visit : మ‌హాల‌క్ష్మి గుడిలో సీఎం కేసీఆర్

అమ్మ వారికి పూజ‌లు చేసిన బీఆర్ఎస్ చీఫ్

CM KCR Visit : తెలంగాణ సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ది చెందిన కొల్హాపూర్ లో కొలువైన మ‌హా ల‌క్ష్మి మాతా (అంబా బాయి) దేవాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఆల‌య క‌మిటీ నిర్వాహ‌కులు సీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు అమ్మ వారికి కేసీఆర్.

CM KCR Visit Maharastra

తెలంగాణ ఉద్య‌మ సార‌థిగా పేరు పొందిన కేసీఆర్ ఆ త‌ర్వాత టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. ఇదే పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం వ‌చ్చేలా చేశారు. అనంత‌రం టీఆర్ఎస్ ను భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ(BRS)గా మార్చారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్త‌రించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ప‌లువురు పార్టీల‌కు చెందిన నాయ‌కులు బీఆర్ఎస్ లో తీర్థం పుచ్చుకున్నారు.

అటు మ‌రాఠాలో ఇటు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున చేర‌డంతో కేసీఆర్ కు బ‌లాన్ని ఇచ్చేలా చేసింది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ముందుగా ప్రార్థ‌నా స్థ‌లాల‌ను, దేవాల‌యాల‌ను సంద‌ర్శించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లతో ఆల‌యాల‌ను అభివృద్ది చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు.

Also Read : CM KCR : అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు సీఎం శ్రీ‌కారం

 

Leave A Reply

Your Email Id will not be published!