YS Jagan Auto Drive : ఆటో న‌డిపిన సీఎం జ‌నం ఆశ్చ‌ర్యం

త‌న రూటే స‌ప‌రేట్ అంటున్న జ‌గ‌న్

YS Jagan Auto Drive : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. దేశంలోనే అతి త‌క్కువ కాలంలోనే పార్టీని స్థాపించి ఏకంగా 151 పైగా సీట్ల‌ను సాధించిన ఘ‌న‌త ఆయ‌న‌కే చెల్లింది.

ఓ వైపు వ‌ర‌దల‌పై స‌మీక్ష చేప‌డుతూనే మ‌రో వైపు రాష్ట్రంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌న‌దైన పాల‌న సాగిస్తున్నారు. తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విస్తు పోయేలా చేశారు ఏపీ సీఎం.

ఈ సంఘ‌ట‌న విశాఖ ప‌ట్టణం జిల్లాలో చోటు చేసుకుంది. అక్క‌డ వాహ‌న‌మిత్ర స‌భ‌ను ఏర్పాటు చేశారు. మీటింగ్ కు వెళ్లే కంటే ముందు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏయూ ఇంజ‌నీరింగ్ కాలేజీ మైదానంలో ఖాకీ చొక్కా ధ‌రించారు.

ఆపై తానే ఆటో న‌డుపుకుంటూ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ కొలువు తీరిన సీఎం(YS Jagan Auto Drive) కోసం వేచి చూస్తున్న ఆటో డ్రైవ‌ర్ల‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.

వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ వాహ‌న మిత్ర ఆటో, ర‌హ‌దారి భ‌ద్ర‌త జీవితానికి ర‌క్ష‌, అభయం, త‌దిత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప‌రిశీలించారు.

వారిని అభినందించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న‌తో వాహ‌న‌దారులు క‌లిశారు. వారితో మాట్లాడిన సీఎం ఎల్ల‌వేళ‌లా ఏ క‌ష్టం వ‌చ్చినా తాను అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు.

త‌మ ప్ర‌భుత్వం పేద‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డుతుంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan Auto Drive). ఇదిలా ఉండ‌గా ఏపీ సీఎం ఆటో డ్రైవ్ చేసిన ఫోటో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : ఏపీలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

Leave A Reply

Your Email Id will not be published!