Perni Nani : స్కిల్ స్కాంలో బాబు కింగ్ పిన్

మాజీ మంత్రి పేర్ని నాని

Perni Nani : ఏపీ స్కిల్ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani). శుక్ర‌వారం అసెంబ్లీ వేదిక‌గా ఆయ‌న నిప్పులు చెరిగారు. అంతులేని అవినీతి, అక్ర‌మాల‌కు చంద్ర‌బాబు అండ్ టీం పాల్ప‌డింద‌ని మండిప‌డ్డారు.

Perni Nani Slams Chandrababu Naidu

ఇప్పుడు టీడీపీ అన్న‌ది లేద‌ని దాని పనై పోయింద‌న్నారు. ఇవాళ చంద్ర‌బాబు లేక పోవ‌డంతో ఆయ‌న స్థానంలో బాల‌కృష్ణ వ‌చ్చి కూర్చున్నాడ‌ని ఇదేనా మీ సంస్కారం అంటూ నిల‌దీశారు. త‌న తండ్రిని వెన్ను పోటు పొడిచిన చంద్ర‌బాబు నాయుడు ముందు మీసం తిప్పితే భ‌లే బాగుంటుంద‌న్నారు.

ఇప్ప‌టికే ప‌క్కా ఆధారాల‌తో చంద్ర‌బాబును జైలుకు పంపించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ ఏదో భూమి బ‌ద్ద‌లై పోయిన‌ట్లు , ఆకాశం కుంగి పోయిన‌ట్లు , సూర్య చంద్రులు క‌నిపించ‌కుండా పోయిన‌ట్లు గగ్గోలు పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు పేర్ని నాని.

క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ లేద‌న్నారు. ఎవ‌రైనా స‌రే చ‌ట్టం ముందు స‌మాన‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉత్త పుత్రుడు క‌నిపించ‌డం లేద‌ని, ద‌త్త పుత్రుడు సైలెంట్ అయి పోయాడంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Namira Salim : స్వంత ఖ‌ర్చుతో అంత‌రిక్షంలోకి

Leave A Reply

Your Email Id will not be published!