Petrol Hike : మళ్లీ పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు పైపైకి

పెంచిన ఆయిల్ కంపెనీలు

Petrol Hike  : పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ప్ర‌పంచ మార్కెట్ పేరుతో చ‌మురు కంపెనీలు జ‌నం చ‌మురు తీసేందుకు న‌డుం బిగించాయి.

నిన్న‌టి దాకా ఎన్నిక‌ల పేరుతో పెంచ‌కుండా ఊర‌ట క‌ల్పించిన స‌ద‌రు కంపెనీలు ఫ‌లితాలు వెలువ‌డ్డాక వ‌రుస‌గా 8 రోజుల్లో ఏడుసార్లు పెంచాయి.

దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్ లీట‌ర్(Petrol Hike) ధ‌ర రూ. 100 దాటింది. మార్చి 22న రేట్ల స‌వ‌ర‌ణ‌లో భాగంగా నాలుగున్న‌ర నెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత ధ‌రా భారం మోపుతూ వ‌స్తున్నాయి కంపెనీలు.

దీంతో మొత్తం మీద పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు లీట‌రుకు రూ. 4.80 పెరిగాయి. తాజాగా లీట‌ర్ పెట్రోల్ కు 80 పైస‌లు చొప్పున పెంచితే లీడ‌ర్ డీజిల్ కు రూ. 70 పైస‌లు పెంచాయి.

దీంతో దేశ వ్యాప్తంగా ఆయిల్ ధ‌ర‌లు రూ. 100 దాట‌డం విశేషం. ఇంధ‌న రిటైల‌ర్ల ధ‌ర‌ల నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర (Petrol Hike)రూ. 99.41 నుండి రూ. 100.21 మార్క్ ను దాటింది. డీజిల్ ధ‌ర‌లు లీట‌ర్ కు రూ. 90.77 నుంచి 91.47కి పెరిగాయి.

కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం (Modi Government) కొలువు తీరిన త‌ర్వాత 2017 నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఆయా కంపెనీలై ఎలాంటి ప‌ట్టు లేక పోవ‌డం బాధాక‌రం.

ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఇటు వాహ‌దారులు అటు ప్ర‌జ‌లు , వినియోగ‌దారులు నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ వ్యాప్తంగా ఆయిల్, నిత్యావస‌ర ధ‌ర‌ల పెంపుద‌ల‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఇప్ప‌టికే ధ‌ర‌లు పెంచ‌డంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సెటైర్లు విసిరారు.

Also Read : డైరెక్ట‌ర్ ప‌ద‌వికి అనిల్ అంబానీ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!