Pilli Subhash Chandra Bose : జగన్ ఆదేశం ముగిసిన వివాదం
కమిటీ నివేదికతో టికెట్
Pilli Subhash Chandra Bose : ఉమ్మడి గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ వివాదం ఎట్టకేలకు సమిసి పోయింది. మంత్రి వేణు గోపాల్ , ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ మధ్య ఆధిపత్య పోరు చివరకు చిలికి చిలికి గాలి వానగా మారింది. అవసరమైతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని, కావాలని మంత్రి తన క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్నారంటూ బహిరంగంగా ఎంపీ సుభాష్ చంద్ర బోస్ ఆరోపించారు.
Pilli Subhash Chandra Bose Said
విషయం తెలుసుకున్న జగన్ రెడ్డి ఎంపీ, మంత్రి మధ్య సయోధ్య కుదర్చాలని, సమస్య సద్దుమణిగేలా చూడాలని సీఎం జిల్లా ఇంఛార్జి మిథున్ రెడ్డిని ఆదేశించారు. ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చారు. హైకమాండ్ మందలించడంతో పిల్లి సుభాష్ చంద్ర బోస్(Pilli Subhash Chandra Bose) మిన్నకుండి పోయారు. ఆయన తనయుడు సూర్య ప్రకాష్ కూడా మౌనం వహించారు.
ఈ సందర్బంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ మీడియాతో మాట్లాడారు. తనను క్షమించాలని, పార్టీ లో కార్యకర్తల ఇబ్బందులు, మనోభావాలు దృష్టిలో పెట్టుకునే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నానని చెప్పారు. తాను జన సేన, తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లే ప్రసక్తి లేదన్నారు. సీఎం ఆదేశాల మేరకు తాను వెనక్కి తగ్గానని, రామచంద్రాపురం సీటు విషయంలో సర్వే చేయించి టికెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
Also Read : July 26th Kargil Vijay Diwas : అమరుల త్యాగం కార్గిల్ విజయోత్సవం