July 26th Kargil Vijay Diwas : అమ‌రుల త్యాగం కార్గిల్ విజ‌యోత్స‌వం

పాకిస్తాన్ సైన్యంపై భార‌త బ‌ల‌గాల విక్ట‌రీ

Kargil Vijay Diwas : దేశ‌మంత‌టా జూలై 26న కార్గిల్ విజ‌య్ దినోత్సవాన్ని జ‌రుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. స‌రిగ్గా ఇదే రోజు జూలై 26న 1999లో భార‌త దేశానికి చెందిన సైన్యం దాయాది పాకిస్తాన్ సైన్యంపై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ గెలుపున‌కు గుర్తుగా కార్గిల్ విజ‌య్(Kargil Vijay Diwas) దినోత్స‌వ్ పేరుతో విజ‌య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.

Kargil Vijay Diwas Day

దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద దేశ ప్ర‌ధాని అమ‌ర జవాన్ల‌కు నివాళులు అర్పించారు. ఇదిలా ఉండ‌గా 1999 ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. కానీ కాశ్మీర్ ను ఆక్ర‌మించు కోవాల‌న్న కుట్ర‌తో పాకిస్తాన్ సైన్యం ఆప‌రేష‌న్ బ‌ద‌ర్ పేరుతో ఉగ్ర‌వాదుల‌ను భార‌త దేశంలోకి పంపించింది. అప్ప‌టి భార‌త స‌ర్కార్ యుద్దం చేయ‌కుండా ఉండాల‌ని శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేసింది. కానీ శ‌త్రు దేశం పాకిస్తాన్ వినిపించు కోలేదు. చివ‌ర‌కు ఒప్పుకోక పోవ‌డంతో గ‌త్యంత‌రం లేక భార‌త దేశ సైన్యం రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.

1999, మే 3న కార్గిల్ జిల్లాలో స‌రిహ‌ద్దు నియంత్ర‌ణ రేఖ వెంట భార‌త్ , పాకిస్తాన్ మ‌ధ్య కార్గిల్ వార్ స్టార్ట్ అయ్యింది. ఆప‌రేష‌న్ విజ‌య్ అనే పేరుతో భార‌త్ సైన్యం పోరాడింది. దాదాపు 60 రోజుల పాటు యుద్దం కొన‌సాగింది. ఇరు దేశాలకు చెందిన సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. భార‌త దేశానికి చెందిన 527 మంది జ‌వాన్లు అమ‌రుల‌య్యారు.

జూలై 26న భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి కాశ్మీర్ ను ఆక్ర‌మించుకుంది భార‌త్. దేశ వ్యాప్తంగా విజ‌యోత్స‌వ సంబురాలు జ‌రుపుకుంటున్నారు. కానీ దేశం కోసం ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా కోల్పోయారు. వారి బ‌లిదానం, త్యాగానికి యావ‌త్ భార‌త దేశం త‌ల వంచి న‌మ‌స్క‌రిస్తోంది. వారిని స్మ‌రించు కుంటోంది.

Also Read : India Tribute : మ‌ణిపూర్ మృతుల‌కు ఎంపీల నివాళి

Leave A Reply

Your Email Id will not be published!