PK vs SK Comment : వ్యూహకర్తలలో విన్నర్ ఎవరో
తెలంగాణ దంగల్ లో నువ్వా నేనా
PK vs SK Comment : అందరి కళ్లు తెలంగాణ రాష్ట్రంపై ఉన్నాయి. కారణం ఇద్దరు ఉద్దండుల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఇది పైకి ఎవరికీ కనిపించక పోయినా ఒకప్పుడు ఒకే సంస్థలో కలిసి పని చేసిన వాళ్లు..ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వ్యూహాలు పన్నడంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరంతా ఎవరనే అనుమానం రాక తప్పదు. మోదీ ఊహించని రీతిలో పోషించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). నిన్నటి దాకా పీకే పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగింది. కానీ పీకేతో పాటు ఎస్కే పేరు కొత్తగా వచ్చి చేరింది. పీకే లాగా పబ్లిసిటీని కోరుకోరు ఈ ఎస్కే. ఎస్కే అంటే తెలుగు మూలాలు కలిగిన కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వ్యూహకర్తగా మారారు. పీకే కూడా ఆ మధ్యన కాంగ్రెస్ హై కమాండ్ తో మీట్ అయ్యారు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ అనూహ్యంగా కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించాడు.
ఆపై ఐదు గ్యారెంటీల పేరుతో జనాన్ని మెస్మరైజ్ చేశాడు. ఆపై అన్నీ తానై వ్యవహరించాడు. 40 శాతం కమీషన్ సర్కార్ పేరుతో కమల సర్కార్ ను ముచ్చెమటలు పట్టించాడు సునీల్ కనుగోలు(Sunil Kanugolu). చివరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే ఊహించని దెబ్బ కొట్టాడు. తలపండిన వ్యూహకర్తల వ్యూహాలు కన్నడ నాట పని చేయలేదు. పేటీఎం అనే పాపులర్ పేరును ఏకంగా పేసీఎం అనే పేరుతో మార్చేశాడు ఎస్కే. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వెనుక కూడా ఎస్కే పని చేశాడు. బీజేపీ మితిమీరిన నమ్మకం కొంప ముంచేలా చేసింది. చివరకు కర్ణాటక హస్తగతమైంది. దీంతో సీఎం సిద్దరామయ్య ఏకంగా కనుగోలుకు కేబినెట్ హోదా ఇచ్చి సలహాదారుగా పెట్టుకున్నాడు.
PK vs SK Comment Viral
ఇదంతా పక్కన పెడితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ప్రశాంత్ కిషోర్ పని చేశాడు. ఈ రెండు రాష్ట్రాలలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ , మమతా బెనర్జీ సీఎంలుగా కొలువు తీరేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత తాను వ్యూహకర్త రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు పీకే. కానీ ఎందుకనో మనసు మార్చుకున్నాడు. ఉన్నట్టుండి తెలంగాణలో ప్రత్యక్షం అయ్యాడు. దేశ రాజకీయాలలో మోస్ట్ డేంజరస్ లీడర్ గా పేరు పొందిన కేసీఆర్ తో ములాఖత్ అయ్యాడు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో పలుమార్లు దొరతో పీకే చర్చోప చర్చలు జరిపాడు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ తెలంగాణలో పవర్ లోకి వచ్చేలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాడు.
ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుత ఎన్నికల్లో ఛాలెంజ్ గా తీసుకున్నాడు సునీల్ కనుగోలు. ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ప్రచారంలో హోరెత్తిస్తున్నాడు. బీఆర్ఎస్ అంచనాలకు ధీటుగా కాంగ్రెస్ ను ముందుకు తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ఏఐసీసీ ప్రధాన లీడర్లను ప్రచారం చేసేలా చేశాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగేలా చేస్తూ చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం జరగబోయే తెలంగాణ దంగల్ (ఎన్నికలు) లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ , కిషన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు ఉన్నా ప్రధానంగా పోటీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్యనే ఉంటోంది. అయితే వీరిద్దరి కంటే వ్యూహకర్తలుగా ఉన్న సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిషోర్ ల మధ్య ఆధిపత్య పోరు లో ఎవరిది పై చేయి అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Kapil Dev Comment : కపిల్ ను మించిన దేశ భక్తుడు ఎవరు..?