PM Modi Conferred : మోదీకి అత్యున్న‌త పుర‌స్కారం

అంద‌జేసిన ఈజిప్టు అధ్య‌క్షుడు

PM Modi Conferred : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. 26 ఏళ్ల త‌ర్వాత ఆయ‌న ఈజిప్టు అధ్య‌క్షుడి ఆహ్వానం మేర‌కు ఆ దేశానికి వెళ్లారు. అక్క‌డ అద్భుత‌మైన రీతిలో సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. అంత‌కు ముందు ప్ర‌ధాన‌మంత్రి అమెరికాలో ప‌ర్య‌టించారు. అక్క‌డ ఆ దేశ చీఫ్ బైడెన్ , జిల్ బైడెన్ ఇచ్చిన విందుకు హాజ‌రయ్యారు.

దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. అక్క‌డి నుంచి నేరుగా ఈజిప్టును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఈజిప్టు దేశ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన మంత్రి, కేబినెట్ మంత్రుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi).

ఇదిలా ఉండ‌గా ఈజిప్టు దేశంలో అత్యున్న‌త‌మైన పుర‌స్కారం ఆర్డ‌ర్ ఆఫ్ ద నైల్ అంద‌జేస్తారు. ఈ అవార్డును ఆదివారం మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి మోదీకి ప్ర‌దానం చేశారు. ఈజిప్టు దేశాధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌త్తా అల్ సిసి వారి ద్వైపాక్షిక స‌మావేశానికి ముందు దీనిని అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఈజిప్టు దేశ అధ్య‌క్షుడికి, ప్ర‌ధాన మంత్రికి, వారి క్యాబినెట్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌న ప‌ట్ల మీరు క‌న‌బ‌ర్చిన ఆదారాభిమానాలు వెల క‌ట్ట‌లేనివ‌ని పేర్కొన్నారు మోదీ. త‌ను జీవిత కాలంలో గుర్తుంచు కోద‌గిన వాటిలో ఇది కూడా ఒకటిగా మిగిలి పోతుంద‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : YS Sharmila KCR : దొంగ‌ల‌కు తాళ‌లిచ్చిన దొర – ష‌ర్మిల‌

 

Leave A Reply

Your Email Id will not be published!