KTR : గొంగ‌డితో త‌యారు చేసిన షూస్ భేష్‌

ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

KTR : ఆలోచ‌న‌లు ఉండాలే కానీ ఈ లోకంలో హాయిగా బ‌తికేయొచ్చు. ప్లాన్ ఉండి స‌మాజానికి ఉప‌యోగ ప‌డుతుంద‌ని అనుకుంటే ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా సంపాదించొచ్చు. తెలంగాణ‌లో గొంగ‌ళ్ల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ. నేసే వాళ్లు ప్ర‌త్యేకం. ఆయా ఊర్ల‌లో గొంగ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది. ఇది ఈనాటిది కాదు గ‌త కొన్నేళ్ల నుంచి కొన‌సాగుతూ వ‌స్తున్న‌దే. దానికి కొత్త అర్థం వ‌చ్చేలా చేసింది ఎర్త్ ట్యూన్స్.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా అమ్ముడు పోయేవి షూస్ (బూట్లు). వీటిని ప్ర‌తి ఒక్క‌రు వాడేందుకు ఇష్ట ప‌డ‌తారు. మార్కెట్ లో ఎన్నో కంపెనీలు వీటిపై ఫోక‌స్ పెట్టాయి. ఇక కార్పొరేట్ కంపెనీలు సైతం వీటిపై దృష్టి పెట్టాయి. కోట్లు కొల్ల గొడుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ కు చెందిన స్టార్ట‌ప్ సంస్థ కొత్త‌గా ఆలోచించింది. గొంగ‌డితో ఏకంగా బూట్ల‌ను త‌యారు చేసింది . వాటికి యార్ అని పేరు పెట్టింది.

ఆదివారం ప్ర‌త్యేక డిజైన్ల‌తో త‌యారు చేసిన షూస్ ను చూసి ఒకింత ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు మంత్రి కేటీఆర్(KTR). ఎందుకంటే తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన టీ హ‌బ్ ఇప్పుడు అంకురాల‌కు వేదిక‌గా మారింది. ఆక‌ట్టుకునేలా ఉన్నాయి డిజైన్లు. ఈ ప్ర‌త్యేక‌మైన బూట్లు నారాయ‌ణ‌ఖేడ్ , జోగిపేట నేత కార్మికులు చేతితో నేసిన గొంగ‌డి దుప్ప‌ట్ల నుండి రూపొందించారు. దీని వ‌ల్ల గొంగడి చేనేత కార్మికుల‌కు మ‌రింత‌గా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ చెప్పారు.

Also Read : MP Vijay Sai Reddy : ముసుగు తొలగిస్తే మంచిది – విజ‌య సాయి

Leave A Reply

Your Email Id will not be published!