PM Modi : నీర‌జ్ చోప్రాకు మోదీ ప్ర‌శంస‌

లౌసానే డైమండ్ లీగ్ విజ‌యం

PM Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ లౌసానే డైమండ్ లీగ్ విజ‌యం సాధించిన నీర‌జ్ చోప్రాను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మోదీ. ఓ వైపు గాయ‌ప‌డినా మ‌రో వైపు దేశం కోసం ఆడిన తీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించారు. ఇదిలా ఉండ‌గా డైమండ్ లీగ్ పోటీలలో స‌త్తా చాటాడు. మ‌రోసారి టైటిల్ కైవ‌సం చేసుకున్నాడు. త‌న సంచ‌ల‌న ఫామ్ కొన‌సాగించాడు. లాసాన్ లో జ‌రిగిన సీజ‌న్ లో రెండోసారి అగ్ర స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

కాగా ఇటీవ‌లే తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కండ‌రాలు దెబ్బ‌తిన‌డంతో ఇబ్బంది ప‌డ్డాడు. కాగా గాయాల‌తో బాధ ప‌డుతున్న‌ప్ప‌టికీ చోప్రా పున‌రాగ‌మ‌నం సంచ‌ల‌నం క‌లిగించింది. క్రీడాభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు న‌రేంద్ర మోదీ. ఓ వైపు గాయం మెలిపెడుతున్నా మొక్క‌వోని ఆత్మ విశ్వాసంతో నెగ్గుకు రావ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు.

త్రో లో 87.66 మీట‌ర్ల ఎత్తులో విసిరాడు. ఔరా అనేలా చేశాడు నీర‌జ్ చోప్రా. ఇప్ప‌టికే స్వ‌ర్ణం గెలిచాడు. జావెలిన్ త్రో ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి ఎగ‌బాకాడు. ఇప్ప‌టికే టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ లో నీర‌జ్ చోప్రా బంగారు ప‌త‌కాన్ని సాధించాడు.

నీర‌జ్ చోప్రా చేప‌ట్టిన ప్ర‌ద‌ర్శ‌న అద్భుత‌మ‌ని పేర్కొన్నారు పీఎం(PM Modi). పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. అత‌డి ప్ర‌తిభ‌, అంకిత భావం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

Also Read : Devendra Fadnavis : బ‌స్సు ఘ‌ట‌నకు రోడ్డు నిర్మాణం కాదు

Leave A Reply

Your Email Id will not be published!