PM Narendra Modi: ఉక్రెయిన్‌ లో లగ్జరీ ట్రైన్ ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో ప్రయాణించనున్న మోదీ !

ఉక్రెయిన్‌ లో లగ్జరీ ట్రైన్ ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో ప్రయాణించనున్న మోదీ !

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెలలో యుద్ధ భూమి ఉక్రెయిన్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో మోదీ(PM Narendra Modi) భేటీ కానున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా… ప్రధాని మోదీ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్‌ రాజధానికి చేరుకోనున్నారు. అదే అత్యంత సురక్షితమైన రైలే కాకుండా విలాసవంతమైన రైలుగా పేరొందిన ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో మోదీ ప్రయాణించనున్నారు.

యుద్దంలో దెబ్బతిన్న మార్గాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్‌ చేరుకోనున్నారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణించనున్నారు. దీనితో మొత్తం 20 గంటలపాటు ఈ రైలులో గడపనున్నారు. ఈ లగ్జరీ రైలులో గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ వంటి ప్రపంచ నాయకులు సైతం ప్రయాణంచారు.

కాగా గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్‌ లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపై మోదీ, జెలెస్కీ నేతలు చర్చించనున్నారు. అయితే 2022లో ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ కీవ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ కంటే ముందు ప్రధాని ఆగష్టు 21న పోలండ్‌లో పర్యటించనున్నారు.

PM Narendra Modi – ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’ రైలు ప్రత్యేకతలు !

‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’ రైలు అనేది అత్యంత సౌకర్యవంతమైన, అత్యున్నత స్థాయి ప్రయాణాలతో కూడింది. ఇది సాధారణ రైలు కాదు. అత్యంత భద్రతతో కూడుకొని ఉంది. విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్‌, సోఫా, టీవీతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన పడక గది కూడా ఉంటుంది. అయితే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఈ లగ్జరీ రైలును నిర్వహించడం అంత సులువు కాదు. అందుకే వీటి భద్రత కూడా అదే స్థాయిలో ఉండేలా ఉక్రెయిన్‌ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Also Read : Supreme Court of India: ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఎందుకంత ఆలస్యం అంటూ నిలదీసిన సుప్రీంకోర్టు !

Leave A Reply

Your Email Id will not be published!