PM Modi Bomman Belli : బొమ్మన్ ..బెల్లీని కలిసిన మోదీ
ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రం
PM Modi Bomman Belli : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆస్కార్ అవార్డు దక్కించుకున్న డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విష్పరర్స్. ఇందులో నటించిన ఏనుగులు, సంరక్షకులు బొమ్మన్ , బెల్లీని కలుసుకున్నారు ప్రధాన మంత్రి(PM Modi Bomman Belli) నరేంద్ర దామోదర దాస్ మోదీ. శిబిరం వద్ద ప్రధానికి స్వాగతం పలికేందుకు బారులు తీరిన ఏనుగులకు చెరకు తినిపించారు. బొమ్మి, రఘు ఏనుగులను ఆయన ఆప్యాయంగా నిమిరారు.
ఆదివారం నరేంద్ర మోదీ ముదుమలై లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. అక్కడ బందీలుగా ఉన్న ఏనుగులను సంరక్షిస్తున్న మహోత్ లు, కావడిలతో సంభాషించారు. ఆస్కార్ అవార్డు పొందిన ఎలిఫెంట్ విస్పరర్స్ లో కనిపించిన స్వదేశీ జంట బొమ్మన్ ..బెల్లీని కూడా మోదీ అభినందించారు. వదిలి వేయబడిన ఏనుగులు రఘు, బొమ్మితో వారి బలమైన బంధాన్ని ది ఎలిఫెంట్ విష్పరర్స్ లో తెరకెక్కించారు దర్శకురాలు.
శిబిరంలో చాలా సేపు గడిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). అనంతరం మైసూరుకు బయలు దేరే ముందు మసినగుడిని సందర్శించారు. అక్కడ గిరిజన ప్రజలతో మమేకయ్యారు. బందీపూర్ టైగర్ రిజర్వ్ నుంచి వెళ్లిన మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. చిత్రంలో నటించినందుకు ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి మోదీ.
Also Read : పుష్ప-2 టీజర్ మామూలు లేదుగా