PM Modi : మ‌రాఠాకు మంగళం గుజ‌రాత్ కు అంద‌లం

చక్రం తిప్పిన మోదీ..షా..గుజ‌రాత్ కు ఎయిర్ బ‌స్

PM Modi : త్వ‌ర‌లో గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  గ‌తంలో ఇక్క‌డ సుదీర్ఘ కాలం పాటు గుజ‌రాత్ లో సీఎంగా కొలువు తీరారు. అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రిగా ప్ర‌స్తుతం కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోంది.

ప్ర‌ధానంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా మార‌నుంది. ప్ర‌స్తుతం త్రిముఖ పోరు కొన‌సాగ‌నుంది. ఎలాగైనా స‌రే మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని బీజేపీ ఆలోచిస్తోంది. ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగా కోట్లాది రూపాయ‌ల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా ల‌క్ష కోట్ల‌కు పైగా ప్రాజెక్టుల‌ను గుజ‌రాత్ రాష్ట్రానికి క‌ట్ట‌బెట్టారు. తాజాగా మ‌రో భారీ ప్రాజెక్టును మ‌హారాష్ట్ర‌కు రావాల్సి ఉండ‌గా దానిని కూడా త‌మ ప్రాంతానికి త‌ర‌లించుకు పోయారు మోదీ, అమిత్ షా. ఆదివారం రూ. 22 వేల కోట్ల విలువైన టాటా – ఎయిర్ బ‌స్ సీ-295 మాన్యుఫాక్చ‌రింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

మొద‌ట‌గా మ‌రాఠాలోని నాగ్ పూర్ లో ఏర్పాటు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణ శాఖ మంత్రి లేఖ‌లో స్ప‌ష్టం చేశారు కూడా. ఈ ప్రాంతం నాగ్ పూర్ అనువుగా ఉంటుంద‌ని కూడా సిఫార్సు చేశారు. స‌మ్మ‌తి తెలియ చేశారు కూడా. కానీ సీన్ మారింది. రూ. 22 వేల కోట్ల రూపాయ‌ల ప్రాజెక్టు గుజ‌రాత్ కు త‌ర‌లి పోయింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి.

Also Read : సోష‌ల్ మీడియాపై కేంద్రం సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!