PM Modi : ఆనందాన్నిచ్చిన అమెరికా పర్యటన
సంతోషంగా ఉందన్న ప్రధాని మోదీ
PM Modi : అమెరికా పర్యటన అత్యంత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిత్రుడు యుఎస్ఏ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ల ఆతిథ్యాన్ని, ఆదరణను తాను ఎన్నటికీ మరిచి పోలేనని తెలిపారు. ప్రపంచంలో భారత్, అమెరికా దేశాలు అత్యంత బలమైన ప్రజాస్వామానికి ప్రతీకగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రత్యేకించి ప్రవాస భారతీయులు తనకు అపూర్వమైన రీతిలో స్వాగతం పలికారని వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) తెలిపారు. ఇరు దేశాలు రాబోయే కాలంలో మరింత ముందుకు కలిసి సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా మా మధ్య బంధం మరింత పెరిగిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా జోసెఫ్ బైడెన్, జిల్ బైడెన్ లు ప్రత్యేకంగా నరేంద్ర మోదీని ఆహ్వానించారు. వైట్ హౌస్ లో ఆతిథ్యం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి బైడెన్ దంపతులను విస్తు పోయేలా చేశారు. అద్భుతమైన కానుకలు అందజేశారు. జిల్ బైడెన్ కు అత్యంత ఖరీదైన వజ్రాన్ని బహూకరించారు.
Also Read : US Singer Touches : మోదీ పాదాలను తాకిన యుఎస్ గాయని