PM Modi Scholz Talks : మోదీతో జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ భేటీ

ఉక్రెయిన్ యుద్దం నిలిపివేతపై చ‌ర్చ

PM Modi Scholz Talks : భార‌త దేశ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్ స్కోల్డ్. ఇందులో భాగంగా ఆయ‌న భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తో(PM Modi Scholz Talks) ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం ర‌ష్యా , ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్దాన్ని నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఎందుకంటే జి20 గ్రూప్ కు భార‌త దేశం ప్ర‌స్తుతం అధ్య‌క్ష‌త వ‌హిస్తోంది. చ‌ర్చ‌ల ద్వారా ప‌రిస్థితిని ప‌రిష్క‌రించు కోవాల‌ని భార‌త దేశం ప‌ట్టు ప‌ట్టింద‌ని , ఏదైనా శాంతి ప్ర‌క్రియ‌కు స‌హ‌క‌రించేందుకు సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ఈ సంద‌ర్భంగా జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ తో ప్ర‌ధాని మోదీ.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ పై యుద్దం ప్ర‌క‌టించి దాదాపు ఏడాది పూర్త‌యింది ఫిబ్ర‌వ‌రి 24తో. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము ఆపే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు ర‌ష్యా చీఫ్ పుతిన్. దీనికి ఎగ‌దోస్తూ ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ప‌ర్యటించారు. బేష‌ర‌తుగా ఉక్రెయిన్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

బైడెన్ టూర్ పై భ‌గ్గుమ‌న్నారు పుతిన్. ఇంకోసారి ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్య రాజ్య‌స‌మితిలో ఓటింగ్ సంద‌ర్భంగా భార‌త్ తాను పాల్గొన‌లేదు. ఇప్ప‌టికే త‌మ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేశామ‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఉక్రెయిన్ సంక్షోభం , ద్వైపాక్షిక వాణిజ్యం , పెట్టుబ‌డుల‌ను పెంపొందించ‌డం , నిపుణుల చైత‌న్యాన్ని పెంచ‌డం, వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాడ‌టం వంటివి స్కోల్డ్ , మోదీ(PM Modi Scholz Talks) మ‌ధ్య చ‌ర్చ‌కు ప్ర‌ధానంగా వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా జ‌ర్మ‌నీ ఆర్థిక మంత్రి క్రిస్టియ‌న్ లిండ్ న‌రి మాస్కోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Also Read : చైనా అభ్యంత‌రం ప్ర‌క‌ట‌న విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!