Ramdas Athawale : ప్రధాని మోదీ ఒక్కరే చాలు – అథావలే
ప్రతిపక్షాలను ఢీకొనేందుకు పీఎం సరిపోతాడు
Ramdas Athawale : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి సూర్య , ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఇందు కోసం బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒకే తాటిపైకి రావాలని ప్రతిజ్ఞ చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే(Ramdas Athawale). గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎంత మంది ఏకమైనా, ఎన్ని పార్టీలు కలిసినా తమ నాయకుడు పీఎం మోదీని ఢీకొనలేరన్నారు. జనతాదళ్ యునైటెడ్ , ఆర్జేడీ నేతలతో జరిగిన సమావేశాన్ని రాహుల్ గాంధీ చారిత్రాత్మకంగా పేర్కొనడాన్ని అథావలే తప్పు పట్టారు. ఏం సాధించారని దీనిని హైలెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వాళ్లే ఇలాంటి గ్రూపులు కడతారంటూ ఎద్దేవా చేశారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) బలంగా ఉందన్నారు. దానిని ఢీకొనే సత్తా ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు మోదీ ఒక్కరే సరిపోతారు. మేమంతా అవసరం లేదని స్పష్టం చేశారు రాందాస్ అథావలే.
Also Read : అజిత్ పవార్ బీజేపీకి బానిస కాలేడు