PM Narendra Modi: దేశ ప్రజల దుర్భుర జీవితానికి కారణం కాంగ్రెస్ – ప్రధాని మోదీ

దేశ ప్రజల దుర్భుర జీవితానికి కారణం కాంగ్రెస్ - ప్రధాని మోదీ

Narendra Modi : యూపీఏ హయాంలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ రేట్ల స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ తరుణంలో కొత్త జీఎస్టీ స్లాబ్‌లపై ప్రధాని మోదీ (Narendra Modi) స్పందించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఇదో మైలురాయి. జీఎస్టీ స్లాబ్‌ సంస్కరణలతో అందరికి ప్రయోజనం కలుగుతుంది. దేశం మరింత బలపడుతుంది. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయి. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరం. యూపీఏ హయాంలోనే అధిక పన్నులు. గతంతో పన్నుల రూపంలో కాంగ్రెస్‌ (Congress) నేతలు దోచుకున్నారు. దేశ ప్రజల దుర్భుర జీవితానికి కాంగ్రెస్సే కారణం. జీఎస్టీ స్లాబుల సవరణలతో జీఎస్టీ సంస్కరణలతో దివాళి గిఫ్ట్‌ ఇచ్చాం అని అన్నారు.

PM Narendra Modi – చిన్నారుల చాక్లెట్లపైనా భారీగా పన్ను వేశారు – కాంగ్రెస్‌ పై మోదీ ధ్వజం

దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించామని, ఇందుకు అనుగుణంగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దీపావళి, ఛత్‌పూజకు ముందే ప్రజలకు రెట్టింపు ఆనందం ఉంటుందని హామీ ఇచ్చామని… చెప్పినట్లుగానే ప్రజలకు సంతోషకరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జాతీయ అవార్డులు పొందిన టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన మోదీ (Narendra Modi)… పన్నులపై కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నారుల చాక్లెట్ల నుంచీ ప్రతి వస్తువుపైనా భారీగా పన్ను వసూలు చేసిందన్నారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో భారీగా పన్నులు వేశారు. చిన్నారుల చాక్లెట్లపైనా 21శాతం పన్ను వసూలు చేశారు. నేనే ఆ పని చేసివుంటే… నాపై తీవ్ర విమర్శలు చేసేవారు. మా ప్రభుత్వ విధానం మాత్రం ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే. నవరాత్రి తొలి రోజు నుంచే జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్తగా పంచరత్నాలను జోడించాం. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి, మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత.. ప్రతిఒక్కరికీ ప్రయోజనం ఉంటుంది. వీటివల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్‌ సాకారమవుతుంది.

హెయిర్‌క్లిప్‌లు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. ప్రస్తుతం రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో పాఠశాలలు నిర్మించుకోవచ్చు. చంద్రయాన్‌ విజయంతో శాస్త్రవేత్తలు కావాలనే కాంక్ష మన విద్యార్థుల్లో పెరిగింది. నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైంది.

టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు… యువతరానికి దారి చూపాలి. చిన్నారుల్లో డిజిటల్‌ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గ్యాంబ్లింగ్‌ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గాంధీజీ నినాదం స్వదేశీ.. దాన్ని అందరం అమలు చేద్దాం. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. మేడిన్‌ ఇండియాపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. మనదేశంలో తయారైన వస్తువులనే వాడాలి. ఇందుకు సంబంధించి ప్రతి ఇల్లు, దుకాణం బయట బోర్డులు కనిపించాలి’’ అని పిలుపునిచ్చారు.

Also Read : Kaish Khan: అటక మీద దాక్కున్న మాజీ ఎంపీను అరెస్ట్ చేసిన పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!