PM Narendra Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్

Narendra Modi : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు ఫోన్‌లో మాట్లాడారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే మార్గాలపై చర్చించారు. మాక్రాన్‌తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం సాధ్యమైనంత త్వరలో ముగిసేందుకు చేయాల్సిన ప్రయత్నాలతో సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించడంలో ఇండియా-ఫ్యాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర కొనసాగించాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు.

PM Narendra Modi Call

కాగా, 2026 ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు హాజరుకావాలని మాక్రాన్‌తో జరిపిన సంభాషణల్లో మోదీ (Narendra Modi) ఆహ్వానించారని, మాక్రాన్ అంగీకరించినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత కోసం ఇరుదేశాలు ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ, కలిసి పనిచేయాలని కూడా ఉభయనేతలు నిర్ణయించినట్టు పేర్కొంది. గత నెల రోజుల్లో మోదీ-మాక్రాన్ ఫోనులో సంభాషించుకోవడం ఇది రెండోసారి. ఆగస్టు 21 మోదీకి (Narendra Modi) మాక్రాన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై శాంతియుత పరిష్కారం కనుగొనే విషయంపై చర్చించారు.

Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలను అభినందించిన మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్‌ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్‌ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్‌, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారాయన.

అంతకు ముందు… భారత్‌, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్‌తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్‌ బదులిస్తూ.. ‘‘భారత్‌, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్‌ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్‌తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్‌ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది.

Also Read : Prisoners: సబ్ జైలు నుండి పరారైన ముద్దాయిలను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!