PM Narendra Modi: ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌ !

ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌ !

PM Narendra Modi : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ ఇరాన్‌ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ (PM Narendra Modi) ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో నేను మాట్లాడాను. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు.

సుదీర్ఘకాలం నుంచి ఇరాన్‌తో పాటు ఇరాన్‌ (Iran) మద్దతిస్తున్న హమాస్, హెజ్‌బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్‌ హమాస్‌, హెజ్‌బొల్లాతో పాటు ఇరాన్‌పై దాడుల్ని తీవ్రతరం చేసింది.

PM Narendra Modi – ఇరాన్‌ పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?

ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు.

ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి కారణం ఇదే

ఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్‌ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్‌ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.

హమాస్: ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్‌లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది.

హెజ్ బొల్లా: ఇది లెబనాన్‌లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.

అందకు హెజ్‌బొల్లా, హమాస్‌తో పాటు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్‌బొల్లా,హమాస్‌ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్‌ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది.

Also Read : Pakistan Spy: పంజాబ్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్‌

Leave A Reply

Your Email Id will not be published!