PM Narendra Modi: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi : విశాఖ వేదికగా శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. భువనేశ్వర్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న ప్రధాని మోదీకు… గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుండి నేరుగా ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ (PM Narendra Modi) వెళ్ళారు. రాత్రికి అక్కడే బసచేసి శనివారం ఉదయం ఆర్.కే. బీచ్ లో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
PM Narendra Modi – ఏపీ నాయకుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు
యోగాంధ్ర నిర్వహణపై ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్తో ప్రధాని మోదీ మాటా మంతీలో పాల్గొన్నారు. ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారని మోదీ వ్యాఖ్యానించారు. యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నామని చంద్రబాబు… ప్రధానితో అన్నారు. ఈ సందర్భంగా ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ మోదీ ప్రశంసించారు.
యోగా డే కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం
యోగా మన సంస్కృతి, సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దామని ప్రజలకు విజ్ణప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్లో జరగనున్న యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. రాష్ట్రంలో వాడవాడలా యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం. వారసత్వంగా వచ్చిన యోగాను మనమంతా ఆచరించటంతో పాటు భవిష్యత్ తరాలకూ అందిద్దాం’ అని అన్నారు.
Also Read : CM Revanth Reddy: బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధం – సీఎం రేవంత్రెడ్డి
