PM Narendra Modi: ‘ఉక్రెయిన్-రష్యా చర్చించుకోవాలి’ – కీవ్ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన !
‘ఉక్రెయిన్-రష్యా చర్చించుకోవాలి’ - కీవ్ పర్యటనలో ప్రధాని మోదీ ఉద్ఘాటన !
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. భేటీలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి జెలెన్‌స్కీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీని అలిగనం చేసుకొని అక్కడి నుంచి రష్య దాడిలో మరణించిన చిన్నారుల స్మారక ప్రాంతానికి తీసుకొళ్లారు. వెళ్లే సమయంలో జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ(PM Narendra Modi) ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు.
PM Narendra Modi…
ఈ సందర్భంగా ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం అన్నివిధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధం కొనసాగుతోన్న వేళ ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని పునరుద్ఘాటించినట్లు పేర్కొంది.
మోదీ ఉక్రెయిన్ పర్యటన చరిత్రాత్మకమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ఇక్కడ సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మోదీ స్పష్టం చేశారని అన్నారు. భేటీ సందర్భంగా సైనిక స్థితిగతులు, ఆహార, ఇంధన భద్రతతో పాటు శాంతిని నెలకొల్పే మార్గాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారని అన్నారు. మరోవైపు, గ్లోబల్ పీస్ సమ్మిట్‌లో తన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భారత్‌ను ఉక్రెయిన్ కోరినట్లు చెప్పారు.
‘‘సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకోవాల్సిన అవసరముందనే భారత్ అభిప్రాయమని’’ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకునేందుకు ఇరువురు నేతలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జులైలో మోదీ(PM Narendra Modi) జరిపిన చర్చల వివరాలను జెలెన్‌స్కీకి వివరించారని అన్నారు.
భారత్-ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు
జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నట్లు తెలిపింది.
మోదీ ఉక్రెయిన్ పర్యటన.. జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసి..
Also Read : Minister Ponguleti : తన ఇల్లు అక్రమమమైతే కూల్చేయమంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన పొంగులేటి