PM Narendra Modi: మే 2న రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

మే 2న రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

PM Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) షెడ్యూల్‌ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం… సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.

PM Narendra Modi Will Visit

మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పర్యటన నోడల్‌ అధికారి వీరపాండ్యన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గత ఐదేళ్ళ వైసీపీ పరిపాలనలో గడ్డు రోజులు ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతి… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత మరల పురాతన వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేసి నిర్మాణాలను పున:ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే అమరావతి పున:నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనితో ప్ర‌ధాని కార్యక్రమం కోసం స్థ‌లం ఎంపిక‌ చేయడంతో పాటు… ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానిని ఆహ్వానించారు. దీనికి ప్రధాని మంత్రి కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో… మే 2న రాజధాని పనులు పున: ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

Also Read : Kinjarapu Rammohan Naidu: గ్లోబల్‌ యంగ్‌ లీడర్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!