PM Narendra Modi: ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన

ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన

Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం క్షేత్ర పర్యటన ఖరారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పర్యటించే ప్రదేశాలైన ఛత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. మంగళవారం శివాజి రాజదర్బార్, శివాజి ధ్యానమందిరం ఏర్పాట్లను ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ… సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు.

ప్రధాన మంత్రి మోదీ (Narendra Modi) మొదటిసారిగా శ్రీశైలం రావడం శుభ పరిణామమని అన్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటనతో క్షేత్ర వైభవం మరింత పెరుగుతుందన్నారు. శ్రీశైలం ప్రాంతం యొక్క విశిష్టత టూరిజం అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క విశేషాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం శివాజి స్ఫూర్తి కేంద్రానికి ప్రధాన మంత్రి మోదీ చేరుకుంటారని మాధవ్ పేర్కొన్నారు.

PM Narendra Modi – మంచు మోహన్ బాబుకు ప్రభుత్వం బిగ్ షాక్

తిరుపతిలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్. విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది. అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.15 లక్షలు జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్.

Also Read : Telangana Congress: జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

Leave A Reply

Your Email Id will not be published!