హైదరాబాద్ : అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ అందినంత మేర దండుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చేసిన చరిత్ర శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలది. ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు ఆగమై పోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించక పోగా వేధింపులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యన విద్యార్థినుల పట్ల వేధింపులు పెరిగి పోతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది మల్కాజిగిరి కమిషనరేట్ లో చోటు ఏసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు 20 రోజుల కిందట సదరు టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆపై రిమాండ్ కు తరలించారు.
అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ పర్రే మైటీన్ అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయ మాటలు చెప్పాడు. తనను పెళ్లి కూడా రహస్యంగా చేసుకోవడం జరిగింది. సదరు బాధితురాలి మెడలో పసుపుతాడు కనిపించడంతో అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో తనను పర్రే మైటీన్ పెళ్లి చేసుకున్నాడని బయట పెట్టంది. హుటా హుటిన స్కూల్ వద్దకు వెళ్లారు. ప్రిన్సిపాల్ ను, టీచర్ ను నిలదీశారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వీరి నిర్వాకంపై మండిపడ్డారు పేరెంట్స్, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో దారికి వచ్చారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో టీచర్ పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. విషయం బయటకు పొక్కడంతో ప్రజా, విద్యార్థి సంఘాలు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.