నిర‌స‌న‌కారుల‌పై ఖాకీల దౌర్జ‌న్యం దారుణం : రాహుల్

స‌ర్ పై వ్య‌తిరేకించ‌డం నేరం ఎట్లా అవుతుందని ప్ర‌శ్న‌

న్యూఢిల్లీ : అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుపై మండిప‌డ్డారు. ఇదే క్ర‌మంలో ఓట్ల చోరీకి స‌హ‌క‌రించిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం నిర‌స‌న‌కారుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అగ్ర నేత‌. ఢిల్లీ పోలీసులు క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారంటూ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ తమకు అండగా ఉంటుందని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు రాహుల్ గాంధీ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో పోలీసుల అణచివేత చర్యల్లో గాయపడిన కంటెంట్ క్రియేటర్ రామిత్ వర్మ, ఇతర నిరసనకారులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు.

నిరసన తెలుపుతున్న విద్యార్థులు దేశ గొంతుక అని, వారికి అడ్డు పడవద్దని కాంగ్రెస్ నేత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. విద్యార్థులను 10 జన్ ప‌థ్ వద్ద కలిసిన తర్వాత గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులైన విద్యార్థులకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రధాని నుండి పోలీస్ కానిస్టేబుల్ వరకు అందరి పైనా చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు తమ పట్ల ప్రదర్శించిన అమానుష ప్రవర్తన గురించి కూడా కొందరు విద్యార్థులు వివరించారు. చాలా మంది మ‌హిళా విద్యార్థులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ధైర్యంగా పాల్గొన్నార‌ని ప్ర‌శంసించారు. నిరసనకారులలో ఒకరైన కేరళకు చెందిన అతిర ఢిల్లీ పోలీసుల దాడి కారణంగా ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ. పోలీసుల చేతిలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఆమె వివరించారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఖాకీల తీరుపై. వీరిని ఉసిగొల్పుతున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ప్ర‌జ‌లు షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!