Polling Day Comment : ఓటు ఆయుధం ప్ర‌జాస్వామానికి మూలం

అహంకారానికి ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య యుద్ధం

Polling Day : ప్ర‌భుత్వాల‌ను కూల్చే శ‌క్తి వంత‌మైనది ఒకే ఒక్క‌టి ఓటు. అత్యంత ముఖ్య‌మైన‌ది, తుపాకీ కంటే , గొడ్డ‌లి కంటే , అటంబాంబు కంటే బ‌లమైన‌ది. ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక ఓటు. ఓటుకు నోటు అన్న ఆలోచ‌న‌కు చెక్ పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. నీళ్లు, నియామ‌కాలు, నిధులు ట్యాగ్ లైన్ తో ఏర్పాటైన తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయి. ప‌దేళ్ల కాలం పాటు సాగించిన కేసీఆర్(KCR) దుర్మార్గ‌పు పాల‌న‌కు ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్దంగా పేర్కొంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. దేశంలోనే తెలంగాణ ఉద్య‌మానికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఆనాడు స‌క‌ల జ‌నులు, సంబండ వ‌ర్ణాలు క‌లిసి సాగించిన పోరాటం కొన్ని త‌రాల‌కు స్పూర్తి దాయ‌కంగా ఉంటుంది.

Polling Day Comment

ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించు కోవాల్సిన స‌మ‌యం ఇది. ఏమ‌రుపాటుగా ఉంటే రాష్ట్ర భ‌వితవ్యాన్ని తాక‌ట్టు పెట్టిన వార‌వుతారు. మ‌నం ఎంచుకున్న అభ్య‌ర్థులే మ‌న‌ల్ని శాసించే స్థాయికి రాకుండా చూడాలి. లేక పోతే అది ప్ర‌జాస్వామ్యం అనిపించుకోదు. రాచ‌రికం అనిపించుకుంటుంది. ప్ర‌జా తీర్పును నీతికి, నిజాయితీకి, ధ‌ర్మానికి బాస‌ట‌గా నిల‌వాలి. లేక పోతే మీ కుటుంబమే కాదు మీ పిల్ల‌లు, మీ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని తెలుసుకోవాలి. భార‌త రాజ్యాంగం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అద్భుత‌మైన అవ‌కాశం ఓటు. కేవ‌లం ఒకే ఒక్క కుటుంబానికి మాత్ర‌మే ప‌రిమిత‌మై పోయిన పాల‌న కావాలో లేక ప్ర‌జా పాల‌న కావాలో తేల్చు కోవాల్సిన సంద‌ర్భం ఇది.

క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌కు, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను చూసి మోస పోకండి. మందు క‌లిపిన మ‌ద్యానికి బానిస‌లు కాకండి. అక్ర‌మంగా , అడ్డ‌గోలుగా సంపాదించిన డ‌బ్బుల‌ను తీసుకోకండి. మీ ఆత్మ గౌర‌వాన్ని చంపుకోకండి. కేవ‌లం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ…ప్ర‌జా సేవ‌కు అంకిత‌మైన వారినే ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నుకోండి. విద్య‌, వైద్యం, ఉపాధి ఇవాళ ఎండ‌మావిగా మారి పోయాయి. అపార‌మైన వ‌న‌రులు ఉన్నా కొంద‌రి చేతుల్లోకి వెళ్లి పోయాయి. కార్పొరేట్, బ‌డా వ్యాపారులు, ఆర్థిక నేర‌గాళ్లు, రియ‌ల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు, రేపిస్టులు, లాయ‌లిస్టులు, లంగ‌లు, ల‌ఫంగ‌లు, దోపిడీదారులు ఇప్పుడు అంతా ఏక‌మై ఒకే గూటి ప‌క్షులుగా మారి పోయారు. వీరింద‌రికీ చెక్ పెట్టాలంటే ప్ర‌జ‌ల చేతుల్లో ఉన్న ఒకే ఒక్క వ‌జ్రాయుధం ఓటు. దానిని గురి చూసి వాడాలి. ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ రాదు. మ‌రోసారి మోస పోవ‌ద్దు. మ‌న త‌ల రాత‌ల‌ను మార్చే ఓటును నిరుప‌యోగం చేయ‌కండి. అస‌లు సిస‌లైన ప్ర‌జాస్వామ్యం కోసం ఓటు వాడండి..

Also Read : Election Campaign Comment : మైకులు బంద్ మ‌నీ..మ‌ద్యం ఫుల్

Leave A Reply

Your Email Id will not be published!