Ponguleti Srinivas Reddy : పొంగులేటికి కీలక పదవి
ప్రచార కమిటీ వైస్ చైర్మన్
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇద్దరు మాజీ ఎంపీలకు కీలక పదవులు అప్పగించింది హైకమాండ్. టీపీసీసీ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా పార్టీ ప్రచార కమిటీని ప్రకటించింది. చైర్మన్ గా నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కు అప్పగించింది. ఆయనకు తోడుగా వైస్ చైర్మన్ గా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. కన్వీనర్ తో పాటు మరో 21 మందితో కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) భారత రాష్ట్ర సమితి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఖమ్మంలో జరిగిన జన గర్జన సభలో ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. భారీ ఎత్తున జన సమీకణ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి ఎంపిక చేసినట్లు కనబడుతోంది. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని గౌడ కమ్యూనిటీకి చెందిన బీసీకి అప్పగించింది. ఇక తెలంగాణలో ప్రభావితమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డికి ఇచ్చింది. వీరితో పాటు మైనార్టీ వర్గానికి చెందిన జాదవ్ ను కన్వీనర్ చేసింది.
Also Read : Madhu Yashki : ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాష్కి