Ponguleti Srinivas Reddy : హ‌స్తానికి పొంగులేటి జై

త్వ‌ర‌లో ముహూర్తం ఖ‌రారు

Ponguleti Srinivas Reddy : భార‌త రాష్ట్ర స‌మితికి రాజీనామా స‌మ‌ర్పించిన ఖ‌మ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి(Ponguleti Srinivas Reddy) శ్రీ‌నివాస్ రెడ్డి ఎట్ట‌కేల‌కు మ‌న‌సు మార్చుకున్నారు. గ‌త కొంత కాలంగా పొంగులేటితో పాటు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సైతం ఏ పార్టీ లోకి జంప్ అవుతార‌నే దానిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ ఇద్ద‌రి నేత‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ట‌చ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజెంద‌ర్ క‌లిశారు. త‌మ పార్టీలో చేరాల‌ని కోరారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.

ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ రాయ‌బారం పంపింది. భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న మాజీ ఎంపీ , మాజీ మంత్రితో స్వ‌యంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని కోరారు.

దీంతో సీన్ మారింది . రంగంలోకి స్వ‌యంగా దిగారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. అటు పొంగులేటిని , ఇటు జూప‌ల్లి కృష్ణారావుతో వారి నివాసాల వ‌ద్ద‌కు వెళ్లారు. ముచ్చ‌టించారు. స‌ర్ది చెప్పారు. పార్టీలోకి రావాల‌ని కోరారు. స‌ముచిత స్థానం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

దీంతో పొంగులేటి, జూప‌ల్లి మెత్త ప‌డ్డారు. చివ‌ర‌కు కాంగ్రెస్ కు జై కొట్టారు. గురువారం సీఎల్పీ నేత భ‌ట్టితో భేటీ అయ్యారు పొంగులేటి. ఈ మేర‌కు త‌న బాట ఎటువైపు అనేది తేల్చి చెప్పారు. వీరితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : RK Roja Pawan Kalyan : బాబు మాట‌లు వింటే అధోగ‌తే – రోజా

Leave A Reply

Your Email Id will not be published!