Ponnam Prabhakar: త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్‌

త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు - మంత్రి పొన్నం ప్రభాకర్‌

Ponnam Prabhakar: రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో కలిసి ఆయన బస్సులను ప్రారంభించారు. నల్గొండ-హైదరాబాద్‌ మధ్య నాన్‌స్టాప్‌ ఏసీ, 3 డీలక్స్‌ బస్సులను ప్రారంభించారు.

Ponnam Prabhakar Comment

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) మాట్లాడుతూ… కొత్తగా 1000 బస్సులు కొన్నామని, మరో 1500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు. దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్‌, 30 లగ్జరీ బస్సులు ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామన్నారు. రూ. 280 కోట్ల బకాయిల్లో రూ. 80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ. 200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Also Read : Priyanka Gandhi: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నాకు ఆశ్చర్యం లేదు – ప్రియాంక గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!