Ponnam Prabhakar : కార్మికులకు సామాజిక భద్రతా పథకం
తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్
Ponnam Prabhakar : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులు, అసంఘటిత కార్మికులకు మేలు చేకూర్చేలా శుభ వార్త చెప్పింది.
Ponnam Prabhakar Comment
రాష్ట్రంలోని రవాణా, రవాణాయేతర రంగంలో పని చేస్తున్న ఆటో డ్రైవర్లు, హోం గార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ. 5,00,000 కవరేజితో సామాజిక భద్రతా పథకం అమలు చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
ప్రమాద బీమా, ప్రీమియం మొత్తం ఖర్చు రూ. 5 లక్షలు అవుతుంది. ఈ పథకం కింద కబర్ చేయబడిన లబ్దిదారునికి బీమా రాష్ట్ర సర్కారే భరిస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పష్టం చేశారు.
ఈ బీమా పథకం సదుపాయం వల్ల వేలాది మంది కార్మికులు, అసంఘటిత కార్మికులకు మేలు చేకూరుతుందని అన్నారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, అందుకే ప్రజా పాలన తీసుకు వచ్చామని చెప్పారు మంత్రి.
Also Read : Skill University : జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ