సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ చేశారు. నంది అవార్డు తనకు రావడం, దానిని తిరస్కరించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టెంపర్ సినిమాలో నటించినందుకు గాను పోసానికి నంది పురస్కారం దక్కింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో మాట్లాడారు.
నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. కానీ ఎవరికి ఇస్తున్నారనే దానిపై అడగడం, ప్రశ్నించడం నా బాధ్యత. అందుకే అప్పట్లో నిలదీశాను. నంది అవార్డులు అనేవి కులాల ప్రాతిపదికన ఇస్తున్నారనే అనుమానం నాకు కలిగింది.
ఈ అవార్డుల కారణంగా చాలా మంది నష్ట పోయారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించడం తట్టుకోలేక టెంపర్ కు నంది పురస్కారం ఇచ్చారు. ఇది నంది కాదు కమ్మ అవార్డుగా అనిపించిందని , అందుకే తాను తిరస్కరించానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తీసుకున్న అవార్డును తిరిగి ఇచ్చేశానని చెప్పారు. ప్రస్తుతం తమ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించి పాత వారికి లేదా కొత్త వారికి ఇవ్వాలా అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జగన్ సర్కార్ స్వంతంగా ఏపీ ఎస్ఎఫ్ఎల్ పేరుతో ఛానెల్ స్టార్ట్ చేస్తోంది. దీనికి చైర్మన్ గా ఉన్నారు పోసాని కృష్ణ మురళి.