PPF Scheme : తక్కువ మొత్తం ఎక్కువ ఆదాయం
మదుపుదారులకు పీపీఎఫ్ గుడ్ న్యూస్
PPF Scheme : పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని అనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే అమలులో ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లో కొద్ది మొత్తంలో,
తమకు అందుబాటులో ఉన్న డబ్బులను జమ చేసుకుంటూ పోతే రేపొద్దున తమ అవసరాలకు సరిపడా భారీ ఎత్తున అందుకోవచ్చు. భారత దేశంలోని పౌరులందరూ ఈ పీపీఎఫ్(PPF Scheme) పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అర్హులు.
ఆన్ లైన్ ద్వారా కానీ లేదా ఆర్బీఐ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులలో పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంది.
అంతే కాకుండా పీపీఎఫ్ కు సంబంధించిన అధికారిక ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా ఖాతా తెరిచి జమ చేసే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
తమ వద్ద ఉన్న చిన్న మొత్తాలతో ఏకంగా పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ ను సృష్టించవచ్చు. ఒక సంవత్సరంలో కనీసంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా జమ చేసే వెసులుబాటు కల్పించింది కేంద్ర సర్కార్.
పీపీఎఫ్ అనేది చిన్న, మధ్య తరగతి, అల్ప ఆదాయ వర్గాల వారికి అద్భుతమైన పథకం. చిన్న మొత్తాల సాధారణ డిపాజిట్లతో కార్పస్ ఫండ్ ను సృష్టించాలని అనుకునే వారికి ఇది దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం.
హామీ ఇవ్వబడిన రాబడితో పీపీఎఫ్ పథకం చాలా తక్కువ రిస్క్ కలిగి ఉంది. దేశంలోని ప్రతి పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్(PPF Scheme) ఖాతా తెరిచేందుకు వీలుంది.
ఇది పూర్తిగా 100 శాతం సురక్షితమైన పథకం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న స్కీం. దీని మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకునే వీలుంది.
Also Read : బీహార్ లో కొలువు తీరనున్న సంకీర్ణ సర్కార్