Prabhsimran Singh : ప్రభ్ సిమ్రాన్ సింగ్ షాన్ దార్
24 బంతులు 4 ఫోర్లు 2 సిక్సర్లు
Prabhsimran Singh : ఐపీఎల్ 16వ సీజన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్నంతగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్ కు ఏ జట్లు చేరుకుంటాయనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇక బలమైన చెన్నై సూపర్ కింగ్స్ కు చుక్కలు చూపించింది స్వంత స్టేడియం చెపాక్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ .
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసింది. డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టేడియం నలు వైపులా షాట్స్ కొట్టాడు. 16 ఫోర్లు 1 సిక్సర్ తో 92 రన్స్ చేశాడు. చివరి దాకా ఉన్నాడు. మరోసారి అజింక్యా రహానే నిరాశ పరిచాడు. బౌలింగ్ పరంగా కట్టుదిట్టం చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్.
అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో మరో స్థానం ముందుకు వెళ్లింది. ఇక పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(Prabhsimran Singh) జోర్దార్ ఇన్నింగ్స్ ఆడాడు.
24 బంతులు ఎదుర్కొన్న సింగ్ 42 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. మరో ఆటగాడు లివింగ్ స్టోన్ 24 బాల్స్ ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ 4 సిక్సర్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు విజయాన్ని చేకూర్చి పెట్టారు.
Also Read : హోరెత్తించిన యశస్వి జైశ్వాల్