Prakash Raj Deepika : దీపికా నిన్ను చూస్తే గర్వంగా ఉంది
పదుకొనేకు ప్రకాశ్ రాజ్ బాసట
Prakash Raj Deepika : ప్రధాన మంత్రిని , భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలను ఏకి పారేస్తూ వస్తున్నారు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఆయన తన వాయిస్ ను వినిపిస్తూనే ఉన్నారు. బెంగళూరులో గౌరీ లంకేశ్ ను దారుణంగా హత్య చేసిన సమయంలో ప్రకాశ్ రాజ్ ఆమె తరపున నినదించారు.
కళాకారులకు స్వేచ్ఛ అన్నది లేకుండా పోయిందని వాపోతున్నారు. తాజాగా మరోసారి తన గొంతు వినిపించారు. ప్రముఖ బాలీవుడ్ నటి, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురు దీపికా పదుకొనేకు సపోర్ట్ గా నిలిచారు. షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే కలిసి పఠాన్ సినిమా తీశారు.
ఇందులో బేషరమ్ సాంగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది దేశ వ్యాప్తంగా. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకోబోమంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ సందర్భంగా దీపికా పదుకొనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఆమె ఫిఫా ప్రపంచ కప్ ను ఆవిష్కరించారు. ఆమెతో పాటు స్పెయిన్ ఫుట్ బాల్ దిగ్గజం కూడా ఉన్నారు. ఇదే సమయంలో పఠాన్ మూవీ, సాంగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లు ఇప్పుడు ఫిఫాను కూడా బ్యాన్ చేస్తారా అని నిలదీశారు ప్రకాశ్ రాజ్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
తాను దీపికా పదుకొనేను(Prakash Raj Deepika) చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు. సినిమాను సినిమా లాగా మాత్రమే చూడాలని దానిని రాజకీయం చేయాలని అనుకోకూడదని సూచించారు.
Also Read : ఫిఫా వరల్డ్ కప్ లో దీపికా హల్ చల్