Prashant kishor : గుజరాత్, హిమాచల్ లో కాంగ్రెస్ గెలుపు కష్టం
సంచలన ప్రకటించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Prashant kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమని జోష్యం చెప్పారు.
గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు నవ్ కల్ప్ చింతన్ శివిర్ పేరుతో నిర్వహించారు. దీనిపై పలు తీర్మాణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా యుద్దం చేయాలని ప్రకటించారు.
యువ నాయకత్వానికి ప్రయారిటీ ఇవ్వాలని తీర్మానం చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ పై , మేథో మథనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
దీనిపైనే కీలక కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant kishor). మేథో మథనం అర్థవంతంగా ఏమీ సాధించ లేక పోయిందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చింతన్ శివిర్ లో కేవలం యథా స్థితిని పొడిగించడంలో సహాయ పడిందని పేర్కొన్నారు.
తనను ఉదయ్ పూర్ చింతన్ శివిర్ గురించి మాట్లాడాలంటూ, అభిప్రాయం చెప్పాలంటూ కోరుతున్నారు. అందుకే తాను కామెంట్ చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈనెల ప్రారంభంలో పోల్ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీతో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా నే ఆ పార్టీలో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్.
ప్రజల్లో నెలకొన్న ప్రతికూలతను పాజిటివ్ గా మార్చుకోక పోతే ఆ పార్టీకి కష్టమవుతుందన్నారు పీకే(Prashant kishor).
Also Read : భాషపై వివాదం మోదీ ఆగ్రహం