Prashant kishor : ఉచితం అధికారానికి మార్గం
ఐప్యాక్ చీఫ్ ప్రశాంత్ కిషోర్
Prashant kishor : అమరావతి – రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్నది మరోసారి నిరూపితమైంది. మొన్నటి దాకా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను అనరాని మాటలు అన్నారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బీహార్ గజ దొంగ, పరమ దరిద్రపు గొట్టు అంటూ నిన్నటి దాకా అనరాని మాటలు అన్న టీడీపీ శ్రేణులు ఉన్నట్టుండి సీన్ మార్చారు. అంతే కాదు టీడీపీకి మద్దతుగా నిరంతరం గొంతు వినిపిస్తున్న పచ్చ మీడియా సైతం ప్రశాంత్ కిషోర్ ను ఏకి పారేశాయి.
Prashant kishor Met Chandrababu
విచిత్రం ఏమిటంటే అదే ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకున్నాడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఆయన సలహాలు, సూచనలు కావాలంటూ ఇప్పటికే ఒప్పందం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. గతంలో ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని , ఆయన పార్టీని అధికారంలోకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ కిషోర్. కావాలి జగన్ రావాలి జగన్ అంటూ ఇచ్చిన నినాదం పవర్ ఫుల్ గా పని చేసింది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారం లోకి రావాలంటే ముందుగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ మేరకు మూడు గంటల పాటు పీకే, బాబుల మధ్య చర్చలు జరిగాయి. యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, మంత్రులు తమ శాఖల పరంగా విఫలమయ్యారని , వీరిని ఆకట్టుకునేలా మరిన్ని ఉచిత పథకాలు ప్రకటించ గలిగితే, హామీలు ఇవ్వ గలిగితే ఏపీలో టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సెలవిచ్చినట్లు సమాచారం.
Also Read : CPI Narayana : బాబు..పవన్ ‘ఇండియా’లో చేరాలి