Prashant Kishor : నితీశ్ తప్పుకుని తేజస్వికి ఛాన్స్ ఇవ్వాలి
రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్
Prashant Kishor : భారతీయ ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు. బీహార్ లో ఇప్పటికే పీకే పాదయాత్ర చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో బీహార్ లో కొలువు తీరిన మహా ఘట్ బంధన్ సర్కార్ పని తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
ప్రధానంగా నితీశ్ కుమార్ ను ఏకి పారేయడం విస్తు పోయేలా చేస్తోంది. మరో వైపు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. ఇదిలా ఉండగా పీకే తాజాగా బాంబు పేల్చారు. సీఎంగా నితీశ్ కుమార్ పనై పోయిందని , వెంటనే తన పదవిని యువకుడైన తేజస్వి యాదవ్ కు ఇవ్వాలని సూచించారు.
దీని వల్ల ఆయనకు అనుభవం వస్తుందన్నారు. ఇంకెంత కాలం పదవిని పట్టుకుని నితీశ్ కుమార్ వేలాడుతూ ఉంటారని ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్. బీహార్ సీఎం పదవి కోసం 2025 దాకా వేచి చూడాల్సిన అవసరం లేదంటూ తేజస్వీ యాదవ్ గురించి పేర్కొన్నారు. దాని వల్ల సమయం వృధా అవుతుందన్నారు.
ఇప్పుడే వయస్సు మీద పడుతుండడంతో పాలనపై సరిగా ఫోకస్ పెట్టడం లేదంటూ నితీశ్ కుమార్ పై ధ్వజమెత్తారు. ఇదే సరైన సమయమని వెంటనే తాను సీఎం పదవి నుంచి తప్పుకుని తేజస్వి యాదవ్ కు అప్పగించాలని కోరారు. దీని వల్ల రాబోయే ఎన్నికల వరకు తనకు అనుభవం కూడా కలిసి వస్తుందని పేర్కొన్నారు పీకే.
Also Read : రాహుల్ కామెంట్స్ నడ్డా సీరియస్