Egypt President : రిప‌బ్లిక్ డేకు అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్

2023లో జ‌రిగే కార్య‌క్ర‌మానికి ఆహ్వానం

Egypt President : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి ఏటా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని ఏదో ఒక దేశానికి చెందిన అధ్య‌క్షుడు లేదా ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇది ఆయా దేశాల మ‌ధ్య స్నేహం పెంపొందించేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది. ఈ త‌రుణంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వ‌చ్చే ఏడాది 2023న జ‌రిగే గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఈజిప్ట్ అధ్య‌క్షుడు అబ్దెల్ ఫ‌తాహ్ ఎల్ – సిసిని(Egypt President)  ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి అధికారికంగా కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది శుక్రవారం. అరబ్ ప్ర‌పంచంపై న్యూఢిల్లీ నిరంత‌ర దృష్టిని ప్ర‌తిబింబిస్తుంది. ఉన్న‌త స్థాయి దౌత్య ప‌ర‌మైన సంబంధాల‌కు సిద్దం అవుతోంది. ఈజిప్టులో అధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 16న కైరోలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సీసీని క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా అధికారిక ఆహ్వానాన్ని అంద‌జేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా 2023లో భార‌త దేశం అధ్య‌క్ష‌త‌న జ‌రిగే జీ20 స‌మ్మిట్ కు ఆహ్వానించిన తొమ్మిది ముఖ్య‌మైన అతిథి దేశాల‌లో ఈజిప్టు కూడా ఉంది.

ఇదిలా ఉండ‌గా క‌రోనా కార‌ణంగా 2021, 2022 వేడుక‌ల‌కు ముఖ్య అతిథులు ఎవ‌రినీ ఆహ్వానించ లేదు కేంద్ర ప్ర‌భుత్వం. బ్రెజిల్ మాజీ చీఫ్ జైర్ బోల్సోనారో చివ‌రగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ విష‌యాన్ని తెలియ చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ ట్విట్ట‌ర్ లో.

Also Read : కావాల‌నే చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!