Shiv Sena Samna : రాష్ట్రపతి ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవాలి
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సామ్నా సంపాదకీయం
Shiv Sena Samna : దేశ వ్యాప్తంగా ఓ వైపు అగ్నిపథ్ స్కీం కలకలం రేపితే మరో వైపు రాష్ట్రపతి ఎన్నిక పై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే సర్కార్ కు అగ్నిపరీక్షగా మారింది. ఎందుకంటే గెలిచే మెజారిటీ దానికి లేదు.
ఇప్పటికే మిత్రపక్షాలతో స్నేహం బెడిసి కొట్టింది. ఈ తరుణంలో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో 17 పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశం అయ్యారు.
ఈ కీలక భేటీకి వైసీపీ, టీఆర్ఎస్ , ఎంఐఎం డుమ్మా కొట్టాయి. శివసేన(Shiv Sena Samna) తరపున ఎంపీ సంజయ్ రౌత్ హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది శివసేన పార్టీ వాయిస్ వినిపించే సామ్నా పత్రిక.
తాజాగా తన సంపాదకీయంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు బలమైన అభ్యర్థిని నిలబెట్ట లేక పోతే ప్రతిపక్షాలకు సమర్థుడైన ప్రధానిని ఎలా ఇస్తారని ప్రజలు అడిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.
తదుపరి ఎన్నికలను ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకోవాలని సూచించింది. మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫరూక్ అబ్దుల్లా లను దీదీ సమావేశంలో ప్రతిపాదించారు రాష్ట్రపతి అభ్యర్థిగా.
వీరే కాకుండా ఇంకా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది సామ్నా. మరో వైపు ఎన్డీయే సర్కార్ బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేంత సీన్ లేదని పేర్కొంది.
శరద్ పవార్ ను ప్రతిపాదిస్తే ఆయన వద్దన్నారు. ఇదే సమయంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఆరు నెలల కిందటే ప్రయత్నం చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని పేర్కొంది సామ్నా(Shiv Sena Samna).
Also Read : నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు