Presidential Polls : దీదీ సమావేశానికి కాంగ్రెస్ ఓకే
హాజరు కానున్న సీనియర్లు
Presidential Polls : రాష్ట్రపతి పదవి ఎన్నిక(Presidential Polls) వ్యవహారం దేశంలో మరింత వేడిని రాజేసింది. ఈనెల 15న ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం.
దీంతో కేంద్రంలో కొలువు తీరిన భారతయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీఏ) అభ్యర్థిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
ఇప్పటికే మోదీ సారథ్యంలోని సర్కార్ బీజేపీయేతర రాష్ట్రాలు, ప్రభుత్వాలు, సీఎంలు, నాయకులు, సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తోంది.
కేసులు, అరెస్ట్ లు, వేధింపులు ఎక్కువ కావడంతో పాటు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతోందంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు దీదీ. ఈ మేరకు దేశంలోని 22 మంది సీఎంలు, ముఖ్య నేతలు, పార్టీ బాధ్యులకు లేఖలు రాశారు.
ఇందులో భాగంగా ఏఐసీసీ సారథ్యంలోని సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపారు. ఎవరు అభ్యర్థి అయినా సరే కానీ అందరికీ ఆమోద యోగ్యంగా ఉండే వ్యక్తిని రాష్ట్రపతి(Presidential Polls) గా నిలబెట్టాలని, మోదీకి చుక్కలు చూపించాలని పిలుపునిచ్చారు.
ఈనెల 15న న్యూ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో దీదీ పిలుపునకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పింది.
ఈ మేరకు ఆ పార్టీ తరపున సీనియర్ నాయకులు మల్లికార్జన ఖర్గే, జైరాం రమేష్ , రణ్ దీప్ సింగ్ సూర్జే వాలా హాజరు కానున్నట్లు సమాచారం.
Also Read : 10 లక్షల ఉద్యోగాల భర్తీకి మోదీ ఆదేశం