Chinnajeeyar Swamy : ఆనాటి సంఘ సంస్కర్త నేటి స్పూర్తి ప్రదాత శ్రీ భగవద్ రామానుజాచార్యుల విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinnajeeyar Swamy).
ఆనాడు శ్రీరామచంద్రుడు ధర్మ బద్దమైన పాలన సాగించారని అదే మార్గాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్నారని కొనియాడారు. నీతి, నిజాయితీ, ధర్మ బద్దమైన జీవితం కలిగిన వారంటూ అభివర్ణించారు.
వెయ్కేళ్ల కిందట ఈ భువిపై జన్మించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. కుల, మతాలను నిరసించి సర్వ ప్రాణ కోటి అంతా ఒక్కటేనని చాటిన మహనీయుడు.
తరాలు మారినా తరగని స్పూర్తి నేటికీ అలాగే ఉందని, అందుకే ఆయన దక్షిణాదిన పుట్టినా దేశమంతటా విస్తరించాడని కొనియాడారు.
సమతామూర్తి రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా ఉండేందుకే 10 ఏళ్ల కిందట దీనిని ఏర్పాటు చేయాలని తలచామని అది ఇవాళ సాక్షాత్కారమైందని అన్నారు చిన్నజీయర్ స్వామి(Chinnajeeyar Swamy).
ఈ దేశంలో ఆధ్యాత్మికతను, భక్తిని పెంపొందించేందుకు, ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోదికి మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు.
అందుకే ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు మోదీకి ఉన్నాయని కితాబు ఇచ్చారు. మోదీ దేశానికి ఐకాన్ గా మారారని పేర్కొన్నారు.
రామానుజుడు చూపిన మార్గం లోనే ప్రధాన మంత్రి నడుస్తున్నారని ప్రశంసించారు. ఆ సమతామూర్తి ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
Also Read : రుద్రాభిషేకంలో పాల్గొన్న మోదీ