Priyanka Gandhi : బ్రిజ్ భూషణ్ ను తొలగించండి
ప్రియాంక గాంధీ డిమాండ్
Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన మహిళా రెజర్లకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీని(Priyanka Gandhi) కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చూసిన మహిళా రెజ్లర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ప్రియాంక ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రియాంక గాంధీ.
ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదన్నారు. దేశానికి తమ ప్రతిభా పాటవాలతో పేరు తీసుకు వచ్చిన మహిళా రెజ్లర్లు, మహిళా క్రీడాకారుల పట్ల మోదీ ప్రభుత్వం ఎందుకు కక్ష సాధింపునకు పాల్పడుతోందో అర్థం కావడం లేదన్నారు. నిత్యం దేశ నాగరికత, సంస్కృతి పేరుతో బాకాలు ఊదే బీజేపీ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఒక రకంగా మోదీని, పాలక వర్గాన్ని నిలదీశారు.
రేయింబవళ్లు శ్రమించి పతకాలు సాధిస్తే ట్వీట్లు చేయడం, ఫోటోలు దిగడం, ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతనవుతుంది కానీ తాము లైంగిక వేధింపులకు గురయ్యామని నెత్తి నోరు బాదుకుంటే కనిపించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు ప్రియాంక గాంధీ. ఆడ బిడ్డలు రోడ్డుపైకి వస్తే స్పందించక పోవడాన్ని సభ్య సమాజం ఛీదరించు కుంటోందన్నారు.
Also Read : రెజ్లర్ల ఆవేదన ప్రియాంక ఆలంబన