Priyanka Gandhi : 30న కొల్లాపూర్ లో ప్రియాంక సభ
ఆరోజే కండువా కప్పుకోనున్న జూపల్లి
Priyanka Gandhi : ఎట్టకేలకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తెలంగాణ టూర్ ఖరారైంది. ఇప్పటికే జూలై 24న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ లో బహిరంగ సభ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీపీసీసీ. ఇదిలా ఉండగా ఖమ్మం వేదికగా జరిగిన జన గర్జన సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎందుకనో చేరకుండా ఆగి పోయారు.
Priyanka Gandhi Tour
అంతకు ముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి ఢిల్లీలో రాహుల్ , మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అధికారికంగా చేరలేదు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఖమ్మం సభకు ధీటుగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని ఇప్పటికే ప్లాన్ చేశారు జూపల్లి వర్గీయులు.
మరో వైపు తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన జూపల్లి జగదీశ్వర్ రావు. జూపల్లి గతంలో మంత్రిగా ఉన్నారు. మొదట కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అక్కడ ఉండలేక రిజైన్ చేశారు. చివరకు మళ్లీ హస్తం బాట పట్టారు. ఇక వాయిదా పడిన ప్రియాంక సభ జూలై 30కి మారిందని పార్టీ పేర్కొంది.
Also Read : Niranjan Reddy : స్వామినాథన్ తో నిరంజన్ రెడ్డి భేటీ