Priyanka Gandhi Wrestllers : రెజ్లర్ల ఆవేదన ప్రియాంక ఆలంబన
మహిళా మల్ల యోధులకు భరోసా
Priyanka Gandhi Wrestllers : తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ , రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ 9 మంది మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా పలువురు తమ సంఘీభావం ప్రకటించారు. ఆప్ మంత్రి అతిషి, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మహిళా రెజ్లర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హుటా హుటిన ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఆమె మహిళా రెజ్లర్ల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసిన మల్ల యోధులు కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని ఓదార్చారు. తాను మీకు ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తప్పక మీ వెంటే ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు ప్రియాంక గాంధీ. ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేపట్టినా ఇప్పటి వరకు ప్రధాని కానీ , క్రీడా శాఖ మంత్రి పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read : అనురాగ్ ఠాకూర్ పై ఆప్ ఆగ్రహం