PT USHA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
ఏకగ్రీవంగా ఎన్నికైన పరుగుల రాణికి అభినందన
PT USHA : భారతీయ పరుగుల రాణిగా పేరొందిన కేరళకు చెందిన పిటి ఉషకు(PT USHA) అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు 58 ఏళ్లు. ఈ దిగ్గజ క్రీడాకారిణి భారత దేశ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆమె అనేక పోటీలలో పలు పతకాలను సాధించింది. ఇందులో భాగంగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆమెకు పోటీగా ఏ ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా పిటి ఉషకు అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలైనందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోని క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా యావత్ క్రీడాకారాలందరి తరపున తాను పీటీ ఉషను ప్రత్యేకంగా గ్రీటింగ్స్ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు కిరెన్ రిజిజు. ఇదిలా ఉండగా ఐఓఏ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు గతంలో పీటీ ఉష చెప్పారు.
ఈ సందర్బంగా నా తోటి అథ్లెట్లు, జాతీయ సమాఖ్యల హృదయ పూర్వక మద్దతుతో తనకు పని చేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పీటీ ఉష(PT USHA) వెల్లడించారు.
ట్విట్టర్ వేదికగా న్యాయ శాఖ మంత్రి, పీటీ ఉష తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా పీటీ ఉష ఎన్నికైన విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించ దగిన క్రీడాకారిణి పీటీ ఉష అని కొనియాడారు.
Also Read : పంత్ కంటే సంజూ శాంసన్ బెటర్