Punjab Bans : పంజాబ్ లో 813 గన్ లైసెన్సులు రద్దు
గన్ కల్చర్ పై భగవంత్ మాన్ సర్కార్ ఫోకస్
Punjab Bans : పంజాబ్ సర్కర్ ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు రెడీ అయ్యింది. ఈ మధ్య సింగర్ తో పాటు ఆందోళనలు, పోలీస్ ఠాణాపై దాడులు జరగడంతో పెద్ద ఎత్తున సీఎం భగవంత్ మాన్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రాస్ట్రంలో గన్ కల్చర్ కి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 813 తుపాకీ లైసెన్సులను రద్దు(Punjab Bans) చేసింది.
ఇప్పటి వరకు మొత్తం 2,000కు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో మొత్తం 3, 73, 053 ఆయుధాల లైసెన్సులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే గన్ కల్చర్ ఏ విధంగా పాతుకు పోయిందో అర్థం చేసుకోవచ్చు.
తుపాకీ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్ సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్ పూర్ నుంచి 10, ఫరీద్ కోట్ నుంచి 84, పఠాన్ కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235 , సంగర్ నుంచి 16 లైసెన్సులు రద్దు(Punjab Bans) చేస్తున్నట్లు ప్రకటించింది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా రద్దు చేసింది.
వీటితో పాటు అమృత్ సర్ కమిషనరేట్ లో 27 మంది, జలంధర్ కమిషనరేట్ లో 11 మందితో పాటు అనేక ఇతర జిల్లాల ఆయుధ లైసెన్సులు కూడా రద్దు చేయడం కలకలం రేపింది. ఎక్కడ కూడా వాడేందుకు వీలు లేదని ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం.
Also Read : తిప్రా మోతా వెనుక ప్రసూన్ కుమార్