R Narayana Murthy : ‘కైకాల‌’కు స‌రైన గుర్తింపు రాలేదు

ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ మూర్తి

R Narayana Murthy : ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ర‌ణం తెలుగు సినిమా రంగానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ మూర్తి. ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచం గ‌ర్వించ ద‌గిన న‌టుడు అని, కానీ ఆయ‌న‌కు రావాల్సినంత ప్ర‌చారం ల‌భించ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేవ‌లం నాలుగైదు సినిమాల‌లో న‌టించిన వారికి అవార్డులు, పుర‌స్కారాలు ద‌క్కాయ‌ని పేర్కొన్నారు. కానీ న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ భౌముడిగా పేరు పొందిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఆశించిన మేర గుర్తింపు ల‌భించ లేద‌ని వాపోయారు ఆర్. నారాయ‌ణ మూర్తి(R Narayana Murthy) . ప్ర‌తి నాయ‌కుడిగా, న‌టుడిగా, క‌మెడియ‌న్ గా, నిర్మాత‌గా ఆయ‌న చేయ‌ని పాత్ర అంటూ లేద‌న్నారు.

నిర్మాత‌గా మంచి సినిమాలు నిర్మించార‌ని కొనియాడారు. ప్ర‌త్యేకించి కైకాల స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌లు బాగుండాల‌ని కోరుకున్నార‌ని ఆయ‌న కూడా త‌ను సినిమాలు తీసిన స‌మ‌యంలో ఇదే చేశార‌ని ప్ర‌శంసించారు. వ్య‌క్తిగ‌తంగా త‌ను గొప్ప మార్గ‌ద‌ర్శ‌కుడిని కోల్పోయాన‌ని వాపోయారు ఆర్. నారాయ‌ణ మూర్తి.

ఇదిలా ఉండ‌గా 1936లో జూలై 25న ఏపీలోని కౌత‌వ‌రం లో పుట్టారు కైకాల‌. అక్క‌డి నుంచి చెన్నైకి వెళ్లారు. జాన‌ప‌ద బ్ర‌హ్మ‌గా పేరొందిన బి. విఠలాచార్య కైకాల స‌త్య‌నారాయ‌ణలోని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించార‌ని ఆ త‌ర్వాత 770కి పైగా సినిమాల్లో న‌టించి చ‌రిత్ర సృష్టించార‌ని తెలిపారు ద‌ర్శ‌కుడు.

ఇదిలా ఉండ‌గా కైకాల స‌త్య‌నారాయ‌ణ గ‌తంలో టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం గౌర‌వ సూచ‌కంగా కైకాల అంత్య‌క్రియ‌ల‌ను శ‌నివారం అధికారికంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది .

Also Read : ‘కైకాల’ మృతి బాధాక‌రం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!