R Praggnandha : క్యాండిడేట్స్ టోర్నీకి ప్ర‌జ్ఞానంద అర్హ‌త‌

చెస్ ప్ర‌పంచ క‌ప్ లో రెండో స్థానం

R Praggnandha : తమిళ‌నాడుకు చెందిన రమేశ్ బాబు ప్ర‌జ్ఞానంద అరుదైన ఘ‌న‌త సాధించారు. తాజాగా జ‌రిగిన చెస్ ప్ర‌పంచ క‌ప్ లో రెండో స్థానంలో నిలిచారు. వ‌చ్చే ఏడాది కెన‌డాలో ఏప్రిల్ లో జ‌రిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హ‌త సాధించాడు.

ఇదిలా ఉండ‌గా చెస్ దిగ్గ‌జం విశ్వ‌నాథ‌న్ ఆనంద్ త‌ర్వాత ఆ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా ర‌మేశ్ బాబు ప్ర‌జ్ఞానంద‌. అత‌డి వ‌య‌సు కేవ‌లం 18 ఏళ్లు. ఆగ‌స్టు 10, 2005లో చెన్నైలో పుట్టారు.

R Praggnandha Played Good Innings

2018లో గ్రాండ్ మాస్ట‌ర్ గా నిలిచాడు. అత్యున్న‌త‌మైన రేటింగ్ సాధించాడు ఆర్. ప్ర‌జ్ఞానంద‌(R Praggnandha). ప్ర‌పంచం లోనే అతి పిన్న వ‌య‌సులో గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్ సాధించిన అభిమ‌న్యు మిశ్రా, సెర్గీ క‌ర్జాకిన్ , గుకేష్ డి, సింద‌రోవ్ త‌ర్వాత ఆర్. ప్ర‌జ్ఞానంద నిలిచాడు.

అంతే కాదు ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్ థింగ్స్ మాస్ట‌ర్స్ ఎనిమిదో రౌండ్ లో ప్ర‌పంచంలో నెంబ‌ర్ ఛాంపియ‌న్ మాగ్న‌స్ కార్ల్ సెన్ ను ఓడించ‌డంతో పేరు పొందాడు. 2013లో అండ‌ర్ 8 వ‌ర‌ల్డ్ యూత్ చెస్ ఛాంపియ‌న్ షిప్ గెలిచాడు.

కేవ‌లం 7 ఏళ్ల వ‌య‌సులో ఇంట‌ర్నేష‌న‌ల్ చెస్ ఫెడ‌రేష‌న్ మాస్ట‌ర్ టైటిల్ సాధించాడు. ఫిడే మాస్ట‌ర్ బిరుదు పొందాడు. అండ‌ర్ -15 టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. 2016లో 10 ఏళ్ల 10 నెల‌ల 19 రోజుల‌లో అంత‌ర్జాతీయ మాస్ట‌ర్ గా నిలిచాడు.

2017లో ప్ర‌పంచ జూనియ‌ర్ చెస్ ఛాంపియ‌న్ షిప్ లో త‌న మొద‌టి గ్రాండ్ మాస్ట‌ర్ హోదాను సాధించాడు. నార్మ్ టోర్నీలో రెండో హోదా పొందాడు ఆర్. ప్రజ్ఞానంద‌. 2019లో రెండో అతి పిన్న వ‌య‌స్కుడిగా నిలిచాడు

Also Read : Patnam Mahender Reddy : ప‌ట్నంకు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!