Rabbi Shergill Comment : బిల్కిస్ బానో కోసం మళ్లీ గొంతెత్తాడు
రబ్బీ షెర్గిల్ అరుదైన గాయకుడు
Rabbi Shergill Comment : బిల్కిస్ బానో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గుజరాత్ గోద్రా అల్లర్ల ఘటనలో 2002లో అయిదు నెలల గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది.
ఆమెతో పాటు 5 ఏళ్ల చిన్నా, కుటుంబీకులంతా దారుణ హత్యకు గురయ్యారు. తనకు జరిగిన అన్యాయం గురించి నినదించింది. కోర్టును ఆశ్రయించింది.
చివరకు 2008లో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దేశానికి స్వతంత్రం వచ్చిన పంధ్రాగస్టు 2022న 11 మందిని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం సత్ ప్రవర్తన కలిగి ఉన్నారంటూ విడుదల చేసింది.
సభ్య సమాజం నిలదీసింది ఈ చర్యను. ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని. వేలాది మంది సంతకాలతో భారత సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. శిక్షకు గురైన వాళ్లను ఎలా విడుదల చేస్తారంటూ తీర్పు చెప్పిన ఆనాటి జడ్జి యూడీ సాల్వే విస్మయం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక ఎత్తు. కానీ
దేశమంతటా చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ అధికారిణి తనకు మద్దతు పలికారు.
దోషులకు స్వీట్లు ఎలా పంపిణీ చేస్తారని, పూల దండలు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు స్మితా సబర్వాల్. ఆమెను అభినందించాల్సిందే.
కానీ ఏనాడైతే బిల్కిస్ బానో అత్యాచారానికి గురైందో ఆనాడే బిల్కిస్ అంటూ గొంతెత్తాడు. పాట కట్టాడు. యావత్ ప్రపంచానికి ఆమె వేదనను, బాధను పాట రూపంలో తెలియ చేశాడు.
అతడే మోస్ట్ పాపులర్ సింగర్ రబ్బీ షెర్గిల్(Rabbi Shergill) . దోషులు మారరు. వారి నుంచి నువ్వు బతకడం కష్టం. మా పంజాబ్ కు వచ్చేయ్. నిన్ను మా సర్దార్లు కాపాడుకుంటారంటూ షెర్గిల్ పిలుపునిచ్చాడు.
చాలా మంది గాయనీ గాయకులు ఉన్నారు. కానీ సామాజిక బాధ్యతగా ఒక బాధితురాలి కోసం తన గొంతుకును ఇచ్చిన వారు అరుదు. ఇందుకు రబ్బీ షెర్గిల్ ను అభినందించాల్సిందే.
షెర్గిల్ మొదటి నుంచీ అంతే. ఓ ధిక్కార స్వరాన్ని కలిగి ఉన్నాడు. 1973లో పుట్టాడు ఈ గాయకుడు. రబ్బీ పేరుతో తొలి ఆల్బమ్ రూపొందించాడు. నేను
ఎవరో నాకు తెలియదంటూ పాట కట్టాడు.
అది పాపులర్ అయ్యింది. రాక్, పంజాబీ, బానీ స్టైల్ మెలోడీతో పాటు సూఫీని కలిపి పాటలు అల్లుతాడు షెర్గిల్. తానే స్వంతంగా కాఫీర్ అనే బ్యాండ్ ను
ఏర్పాటు చేశాడు. ఎన్నో జింగిల్స్ ను కంపోజ్ చేశాడు.
2008లో మత పరమైన హింస, సామాజిక బాధ్యత , నైతికత ఆధారంగా పాటలు కట్టాడు. జబ్ తక్ హై జాన్ కీ సినిమాలో పాడాడు. పంజాబ్ జానపదానికి సొబగులు అద్దాడు రబ్బీ షెర్గిల్.
ప్రపంచంలో పేరొందిన సింగర్స్ తో కలిసి పని చేశాడు. తండ్రి సిక్కు బోధకుడు. తల్లి కవయిత్రి. ఆప్ కు కూడా మద్దతు పలికాడు.
ఎన్నో ఆల్బమ్ లు , అవార్డులు అందుకున్నాడు షెర్గిల్.
కానీ నేటికీ తన గొంతును మాత్రం అన్యాయాలు, సమస్యలు, ఆక్రందనలకు గొంతుకనిస్తున్నాడు. జీతే రహో రబ్బీ షెర్గిల్.
Also Read : సోనాలీ ఫోగట్ మృతిపై అనుమానం